Monday, December 23, 2024

కాలుష్యరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్య పర్చి పర్యావరణ రహిత జిల్లాగా ఖమ్మం జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి పిలుపునిచ్చారు. సోమవారం ఐడిఓసి అదనపు కలెక్టర్ చాంబర్‌లో ఈ సంవత్సరం ఇచ్చిన ముఖ్య ఉద్దేశానికి అనుగుణంగా జిల్లా అదనపు కలెక్టర్ జ్యూట్ బ్యాగ్స్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా ప్రతి ఒక్కరూ జ్యూట్ బ్యాగ్స్ లేదా క్లాత్ బ్యాగ్స్‌ని వాడాలని కోరారు. వాటిని కూరగాయల మార్కెట్ మయూరి సెంటర్లో రైతు బజారులో వచ్చే ప్రజలకు అందించాల్సిందిగా సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 5న నిర్వహించుకోవడం జరుగుతున్నదని, ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం ‘ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలు’ గా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం పర్యావరణ ఇంజనీర్ బి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News