Sunday, December 22, 2024

జన గర్జన సభను విజయవంతం చేయండి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : జూలై రెండవ తేదీన ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న తెలంగాణ జన గర్జన సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సంభాని చంద్ర శేఖర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ కోరారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్ లో గురువారం ఖమ్మం నియోజక వర్గ అన్ని డివిజన్ల అధ్యక్షులకు,కార్యకర్తలకు, ప్రస్తుత, మాజీ కార్పొరేటర్లకు రఘునాథ పాలెం మండల నాయకులతో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ అధ్యక్షతన సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ.. అడవుల్లో వాగులు వంకలు దాటుతూ నిప్పులు కురుస్తున్న ఎండల్లో అకాల వర్షాలు గాలి దుమరాలు వడగాల్పులను అధిగమిస్తు పేరు పేరునా ప్రజల్ని పలకరిస్తూ కన్నీళ్ళతో వచ్చిన వారికి భరోసా కల్పిస్తూ సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మొదలు పెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు దశకు చేరుకుందని అన్నారు. రాహుల్ గాంధీ హత్ సే హత్ జోడో యాత్ర ఇచ్చిన స్ఫూర్తితో సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టి విజయవంతంగా ముగించనున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కార్పొరేటర్ లు మలిదు వెంకటేశ్వర్లు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, లాకావాత్ సైదులు, రెంటల ప్రసాద్, సుధాకర్, అబ్బాస్ బెగ్, గడ్డికొప్పుల ఆనందరావు, బాతుల సుధాకర్, పల్లెబోయిన భారతి చంద్రం, మండల అధ్యక్షుడు భూక్యా బాలాజీ, పసుపులేటి దేవేందర్, చోటే బాబా, డివిజన్ అధ్యక్షులు, అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, ఎంపిటిసి లు, సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News