Monday, December 23, 2024

జన గర్జన సభను విజయవంతం చేయండి

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం అర్బన్ : జూలై 2వ తేదీన ఖమ్మంలో జరిగే జనగర్జన సభను విజయంతం చేయాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక బస్టాండ్ సెంటర్‌లోని రైటర్ బస్తీలో ఉన్న జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మాణిక్‌రావు ఠాగుర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరితో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరవుతున్నట్లు ప్రకటించారు.

ఈ సభకు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావుతో పాటు మరికొంతమంది నాయకులు చేరికలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లిఖార్జున్, పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు, ఆంతోటిపాల్, వెంకటేశ్వర్లు, రాజు, ఏలూరి రాజేష్‌కుమార్, రమేష్, లక్ష్మణ్, నాగభూషణం, శ్రీనివాస్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News