Saturday, November 23, 2024

ఎల్‌బినగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దా : సుధీర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

వనస్థలిపురం: నగరంలోని అన్ని నియోజక వర్గాలకంటే ఎల్బీనగర్ నియోజక వర్గాన్ని కాలనీ వాసుల సహకారంతో ఆదర్శనియోజక వర్గంగా తీర్చిదిద్దడం జరిగిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దెవిరెడ్డి సుధీర్ రెడ్డి వెల్లడించారు. అదివారం వనస్థలిపురం డివిజన్ పరిధిలోని యఫ్,సి.ఐ కాలనీ కమ్యూనిటిహాల్‌లో కాలనీల సంక్షేమ సంఘం సభ్యులచే వనస్థలిపురం డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు చింతల రవి కుమార్ గుప్తా అధ్యక్షతన అత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలోని అన్ని నియోజక వర్గాలకంటే ఎల్బీనగర్‌లో పార్కులు, స్విమ్మింగ్‌పూల్, ప్లేగ్రౌండ్స్, ఫ్ల్లైఓవర్స్ నిర్మించడమే కాకుండా సిగ్నల్ రహిత చౌరస్తాగా ఎల్బీనగర్ ను తీర్చిదిద్దడం జరిగిందని ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని చూసి నగరంలోని ఇతర నియోజక వర్గాలు పోటిపడుతున్నాయని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి వెల్లడించారు. గతంలో ఎల్బీనగర్ లో అభివృద్ధ్ది ఏమాత్రం జరుగలేదని నేను హుడా చైర్మన్‌గా ఉన్నప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధే నేటికి కనిపిస్తుందని దీనికి నేను ఎంతో సంతోషిస్తున్నాయని నిరంతరం నా నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడుతానని కాలనీలలో ఏ సమస్య వచ్చిన పార్టీల కతీతంగా అభివృద్ధి చేస్తున్నానని సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు.

గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 70 శాతం పూర్తి చేశానని అక్కడక్కడ మిగిలిన సమస్యలను మరోమూడు నెలలో పరిష్కరిస్తానని ఈ సందర్భంగా కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ప్రణాలికబద్ధ్దంగా ఐదు సంవత్సర కాలంలో ఎల్బీనగర్‌లో ఎంతో అభివృద్ధ్ది జరిగిందని ప్రతి పక్షపార్టీలు అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని విమర్శలు మానుకొని ప్రతిపక్ష పార్టీల బాధ్యత ఏమిటని ఓక్కసారి చర్చించుకోవాలని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దశలో ప్రతి పక్షపార్టీలు కృషి చేయాలని ఇకనైనా విమర్శలు మానుకుంటే ప్రజల్లో పుట్టగతులు ఉంటాయని లేనిచో ప్రజా ఆగ్రహనికి గురికాక తప్పదని, సోషల్ మీడియాను ఉపయోగించుకొని ప్రతి పక్షపార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయని సుధీర్ రెడ్డి ఆరోపించారు.

బైరామల్‌గూడ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందు మరో ఆరు నెలలో ప్లైవర్ పూర్తి కానున్నదని దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీరనున్నదని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా, వైద్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోని రాష్ట్రంలో 102 గురుకుల కళాశాలు ఏర్పాటు చేయడం జరిగిందని సుధీర్‌రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, కంట్లూరి వెంకటేష్ గౌడ్, మదు గౌడ్, ఈశ్వరమ్మా యాదవ్, వేములయ్య గౌడ్, చాపల శ్రీనివాస్ యాదవ్, అజయ్ యాదవ్, కైసర్, పి.వీ రావు, అనంద్ రాజ్, గడాల రాజు, పలు కాలనీల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News