- Advertisement -
అమరావతి: పేదలకు ఎపి మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ జరిగింది. మంగళగిరిలో ‘మన ఇల్లు- మన లోకేష్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడో రోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంగళగిరి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధమని అన్నారు. దేశంలోనే నెం.1 నియోజకవర్గంగా మంగళగిరిని మారుస్తానని చెప్పారు. స్వర్ణకారుల కోసం త్వరలో జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ దశ మార్చనుందని వెల్లడించారు. సులభంగా అయ్యే పట్టాలు ఈ ఏడాది ఇచ్చేస్తామని తెలియజేశారు. రైల్వే ఎండోమెంట్ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలకు రెండేళ్లు పడుతుందని, అవినీతి లేకుండా వెయ్యి కోట్ల ఆస్తిని ప్రజలకు అందజేస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు.
- Advertisement -