మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఏడాది జనవరి 11,12 తేదీలలో కర్నూల్‌లో జరుగనున్న అఖిల భారత ఉపాధ్యాయ సమాఖ్య 27వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఎఐఎస్‌టిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇంద్రశేఖర్ మిశ్రా పిలుపునిచ్చారు. జాతీయ విద్యా విధానం, విద్యా హక్కు చట్టంపైన చర్చ పత్రం ఉంటుందని, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్‌టియు ఆంధ్ర, తెలంగాణ అధ్యక్షులు ఎల్. సాయి శ్రీనివాస్, ఎం. పర్వత్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఎస్‌టియు భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఎఐఎస్‌టిఎఫ్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంఎల్‌సి కత్తి నరసింహారెడ్డి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హెచ్. తిమ్మన్న, జి. సదానందం గౌడ్, నాయకులు అన్సారి, జుట్టు గజేందర్, కరుణాకర్ రెడ్డి, పోల్ రెడ్డి, కమల్‌అహ్మద్, పరమేశ్వర్, భాస్కర్, ఇఫ్తకారుద్దీన్, రాధ జయలక్ష్మి, అజర్ జహన్, ప్రవీణ్ కుమార్, వెంకటేష్, పాండు రంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.