Saturday, January 25, 2025

డాలర్‌తో రూపాయిని సెంచరీ చేయిస్తారా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ పతనంపై ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ శుక్రవారం తీవ్రంగా తూర్పారబట్టింది. గడచిన పది సంవత్సరాల్లో కరెన్సీ 50 శాతం మేర పతనమైందని, దానిని సెంచరీ చేయాలని ప్రధాని దృఢచిత్తంతో ఉన్నట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనతె చేతిలో ఒక భూతద్దంతో ఢిల్లీలో విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, రూపాయి ఎంత దారుణంగా పతనమైందో, దానితో ప్రధాని గౌరవం ఎంతగా క్షీణించిందో తాను తేల్చుకోలేపోతున్నందున దీనిని తీసుకువచ్చానని చెప్పారు.

‘పడిపోతున్న రూపాయితో ప్రధాని గౌరవం, ఆయన పదవి గౌరవం కూడా పతనం అవుతాయని అన్నది మోడీయే. ప్రధాని మోడీ ఇప్పుడు ఏమంటారో’ అని ఆమె అన్నారు. ‘రూపాయి ఇప్పుడు డాలర్‌కు 87 దగ్గర్లో ఉంది. మోడీ ప్రధాని అయినప్పుడు డాలర్‌తో రూపాయి మారకం విలువ 58గా ఉంది. డాలర్‌తో రూపాయి విలువ 29 పైసలు పతనమైంది. గడచిన పది సంవత్సరాల్లో 50 శాతం పతనమైందన్న మాట. దానిని సెంచరీ చేయించాలని ఆయన తన మనస్సులో నిశ్చయించుకున్నట్లుంది’ అని శ్రీనతె 24 అక్బర్ రోడ్‌లోని ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో విలేకరులతో అన్నారు. రూపాయి విలువ పునరుద్ధరణకు ఏమైనా ప్లాన్ ఉన్నదా అని, రూపాయి నియంత్రణకు. పటిష్ఠతకు విలువైన విదేశీమారక ద్రవ్య నిల్వలను ఎంత కాలం వెచ్చిస్తారు అని కేంద్రాన్ని ఆమె అడిగారు.

‘ప్రస్తుతం రూపాయి 87తో దాగుడు మూతలు ఆడుతోంది. రూపాయి పారిపోతున్నట్లు కనిపిస్తోంది. ‘ఈ దఫా 60 పార్, 65 పార్, 70 పార్,75 పార్, 80 పార్, 85 పార్ అని ప్రధాని మోడీ వెనుక నుంచి నినాదాలు చేస్తున్నారు& ఇప్పుడు మనం 87 పార్ కూడా చేస్తాం. రూపాయి సెంచరీ చేసేలా చూడాలని నరేంద్ర మోడీ నిశ్చయించారు’ అని కాంగ్రెస్ నాయకురాలు విమర్శించారు. ‘రూపాయి పతనం గురించి నరేంద్ర మోడీని అడిగినట్లయితే ఆయన (తొలి ప్రధాని జవహర్‌లాల్) నెహ్రూజీని అందుకు నిందిస్తారు’ అని ఆమె అన్నారు, ఇది ఇలా ఉండగా, శుక్రవారం ఉదయం వ్యాపారంలో యుఎస్ డాలర్‌తో రూపాయి విలువ 18 పైసల మేర పెరెగి 86.26 స్థాయికి చేరింది. సకారాత్మక దేశీయ ఈక్విటీలు, సరళమైన అమెరికన్ కరెన్సీ సూచి అందుకు దోహదం చేశాయి. గురువారం యుఎస్ డాలర్‌తో రూపాయి విలువ 9 పైసల మేర క్షీణించి 86.44 స్థాయికి స్థిరపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News