Monday, December 23, 2024

మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు సమకూర్చండి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జూలై 1న జరగనున్న గ్రూప్ -4 పరీక్ష కేంద్రాలలో మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లును సమకూర్చాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వాణినికేతన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ -4 పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రూప్ -4 పరీక్షలకు హాజరు కానున్న మహిళా అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా పరీక్ష కేందరంలో ప్రత్యేక ఏర్పాట్లను సమకూర్చాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోకి వచ్చే అభ్యర్థులు ఎవరు సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వాచ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకుండా జాగ్రత్త పడాలని, అభ్యర్థులు లోపలికి ప్రవేశించే ముందు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, పాఠశాలలోకి రావడం తిరిగి బయటకు వెళ్లడానికి ఒకే ప్రవేశం ఉండాలన్నారు.

గ్రూప్ -4 పరీక్షకు 54,019 అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, 53,361 అభ్యర్థులు తెలుగులో, 658 అభ్యర్థులు ఉర్దూలో పరీక్ష రాయనున్నారని, ఇందులో 657 మంది ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు, 82 మంది స్కైబ్‌లు ఉన్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సుధాకర్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నవీన్, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News