Wednesday, January 22, 2025

పారిశ్రామిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్‌ను విజయవంతం చేయండి

- Advertisement -
- Advertisement -

జై స్వరాజ్ పార్టీ పిలుపు

మన తెలంగాణ / హైదరాబాద్ : బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్, పారిశ్రామిక సమ్మెకు వివిధ ట్రేడ్ యూనియన్లు ఇచ్చిన పిలుపుకు జై స్వరాజ్ పార్టీ(జెఎస్‌పి) మద్దతు ఇస్తోందని ఆ పార్టీ జాతీయ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, పేదల బ్యాంకు ఖాతాల్లోకి 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పిన బిజెపి ఇంత వరకు చేసిందేమి లేదని అనానరు. నిరుద్యోగం భారీగా పెరిగిందని, గత పదేళ్లలో ‘అచ్ఛే దిన్‘, ‘మెరుస్తున్న భారతదేశం’ అనే చర్చ వాస్తవ అవాస్తవాల వెలుగులో ఒక జోక్‌గా మారిందని ఆయనన్నారు.

కార్మికుల వేతనాలను తగ్గించే సాధనంగా, ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలోని సాధారణ శ్రామిక శక్తిని తగ్గించి తాత్కాలిక కార్మికులను అధికం చేయడంతో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌పై ఉద్యోగాలు చేయడం ఆనవాయితీగా మారింది. స్వచ్ఛంద, స్కీమ్, గిగ్ మొదలైన వాటిని పేర్కొనడంతో కార్మికులకు హోదా, వేతనాలు నిరాకరించబడ్డాయి. బిజెపి పభుత్వం కనీస వేతనాలను తగ్గించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం ఒకే గొంతుకలో లేవాలని, అందులో భాగంగా ఫిబ్రవరి 16న పారిశ్రామిక సమ్మె విజయవంతం చేయాలని కార్మికవర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జై స్వరాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుంబాల పరశు రాములు గౌడ్, జై స్వరాజ్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఆర్ ఎస్ జే. థామస్, పార్టీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ కుమార్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యువరాజ్, పార్టీ నాయకులు ఎం.ఏ.ఖాన్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News