Wednesday, January 22, 2025

విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మహాజన సభను విజయవంతం చేయండి

- Advertisement -
- Advertisement -

ఆత్మగౌరవ సభ గోడపత్రికను ఆవిష్కరించిన జూలూరి గౌరీశంకర్

మనతెలంగాణ / హైదరాబాద్: నవంబర్ 5న ఉప్పల్ బగాయిత్‌లో ఉన్న విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతి ఆత్మగౌరవ భవన నిర్మాణ స్థలంలో జరుగుతున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రముఖ రచయిత,సాహితీ వేత్త జూలూరి గౌరీశంకర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఆత్మగౌరవ సభ గోడపత్రికను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మహాజన సభ ఆహ్వన కమిటీ పెద్దలు డాక్టర్ లాలుకోట వెంకటాచారి, అధ్యక్షులు డాక్టర్ వేములవాడ మదన్మోహన్, ప్రధాన కార్యదర్శులు బ్రహ్మశ్రీ చొల్లేటి కృష్ణమాచార్యులు, బ్రహ్మశ్రీ రాళ్ళబండి విష్ణు చారి, ఉపాధ్యక్షులు బ్రహ్మశ్రీ వీరోజు చంద్రమౌళి, పబ్బోజు బిక్షపతి, సలహా దారులు బ్రహ్మశ్రీ రాగిఫణి రవీంద్రాచారి గారు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News