Monday, January 20, 2025

5 కె రన్‌ను విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

అలంపూర్ : గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో జరిగే ఐ ఓట్ ఫర్ ష్యూరు అనే అంశంపై జరిగే 5కె రన్‌ను విజయవంతం చేయాలని అధికారులతో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సమీక్ష నిర్వహించారు. శుక్రవారం ఐడిఓసి కలెక్టర్ చాంబర్‌లో అదనపు కలెక్టర్లు, అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలోని ఐడిఓసి నుండి కృష్ణవేణి చౌక వరకు 5 కె రన్ శనివారం ఉదయం ఆరు గంటలకు జరుగుతుందని, అలంపూర్‌లోని గాంధీ చౌక్ నుండి మాంటిసోరి స్కూ లు వరకు 5కె రన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

గద్వాలలో ప్రైవేట్ ,ప్రభుత్వ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు ఆయా కళాశాలల అద్యాపకుల ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులు వారి వార్డెన్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకు ఐడిఓసి చేరుకోవాలన్నారు. అలంపూర్‌లో కళాశాల పాఠశాల ప్రైవేట్ , విద్యార్థిని విద్యార్థులు ప్లకార్డులతో సకాలంలో చేరుకోవాలన్నారు. 5 కె రన్ నిర్వహించే మార్గం గుండా మున్సిపాలిటీ వారు తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు.

రెండు నియోజకవర్గాలలో 5 కె రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు యువత పెద్ద ఎత్తున పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహన్, చీర్ల శ్రీనివాస్ , అడిషనల్ ఎస్పీ రవి, శ్వేత ప్రియదర్శిని, అలంపూర్ తహసీల్దార్ జుబీర్, ఆనంద్, నర్సిములు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News