Sunday, January 19, 2025

భట్టి పాదయాత్ర ముగింపు సభను సక్సెస్ చేయండి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పిపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ కోరారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవ రెడ్డి భవనంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత్తం సూర్యాపేట జిల్లాలో నడుస్తున్న పాదయాత్ర జూలై 2 నుండి 5వ తేదీలోపు ఖమ్మం నగరానికి చేరుకుంటుందని ఈ తేదిలో రాహుల్ గాంధి ఇచ్చే అపాయిమెంట్ ను బట్టి ఖమ్మం నగరంలు ముగింపు సభ జరుగుతుందని ఆయన చెప్పారు.

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు హత్ సే హత్ జోడో యాత్ర స్ఫూర్తితో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మొదలు పెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఈ నెల 2 నుంచి 5వ తేదీలలో ఖమ్మం జిల్లాలో ముగుస్తుందని, అందులో భాగంగా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సభకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అది నాయకులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, ప్రజాస్వామ్య వాదులు అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.

మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆరోగ్యం సహకరించక పోయినా ప్రజల మధ్యే తిరుగుతూ భట్టి విక్రమార్క చరిత్ర సృష్టిస్తున్నారని అన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ భట్టి పాదయాత్ర ఈనెల28కి ఖమ్మం జిల్లాలోకిప్రవేశిస్తుందని జిల్లా సరిహద్దులో నాయకన్ గూడెం వద్ద జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికడంతో ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తుందన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో మాజీ ఎమ్మేల్సి పోట్ల నాగేశ్వరరావు, పీసిసి సభ్యులు రాయల నాగేశ్వర్ రావు, వైరా పీసీసీ సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యాడ్లపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News