Tuesday, March 4, 2025

నల్ల చెరువును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి

- Advertisement -
- Advertisement -

వనపర్తి : వనపర్తి పట్టణ శివారులో ఉన్న నల్ల చెరువును జిల్లా ప్రజలు ఆహ్లాదం కోసం వాడుకునే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డితో కలిసి నల్ల చెరువును సందర్శి ంచారు.

చెరువు చుట్టూ ఒక ప్రణాళిక ప్రకారం మొక్కలు నాటాలని, ప్రజలు ఉదయం, సాయంకాలం సేద తీరేందుకు, పిల్లలు ఆహ్లాదం కోసం సందర్శించే విధంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అవసరమైనప్పుడు ఒక సమావేశం లేదా వేడుక నిర్వహించుకునే విధంగా చూడాలని సూచించారు. మంచి మొక్కలు నాటే విధంగా చూడాలని ముందుగా ఎక్కడెక్కడ నాటాలనేది ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి, ఇతర సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు.


- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News