Sunday, December 22, 2024

ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయండి

- Advertisement -
- Advertisement -

పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు కైట్ ఫెస్టివల్
తెలంగాణ కళలకు పూర్వ వైభవం తీసుకువస్తాం
పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి

మన తెలంగాణ / హైదరాబాద్ : సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 13 నుంచి 15 వరకు జరిగే అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూప్ల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. మంగళవారం సచివాలయం మీడియా పాయింట్ లో మంత్రి విలేకరులతో మాట్లాడారు. అంతకు ముందు వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రతినిధులు సచివాలయంలో మంత్రితో భేటీ అయ్యారు. కైట్ ప్లేయర్లు రకరకాల పతంగులు తీసుకుని ఇతర దేశాల నుంచి ఇక్కడకు వచ్చి మనకు పరిచయం చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి చెప్పారు. ఈ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ గురించి వివరించారు. ఈ సందర్భంగా రకరకాల గాలిపటాలను ఆవిష్కరించారు. దేశ, విదేశాల నుంచి వచ్చే అతిధులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనమైన ఆతిథ్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్ద్రాయాలు ప్రతిభింబించేలా ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు. భవిష్యత్తులో ఈ వేడుకను మరింత ఘనంగా నిర్వహించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని, ప్రతిపాదనలు అందజేయాలని ప్రతినిధులను కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఒక ‘మినీ ఇండియా’ అని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వచ్చినవారు కాస్మోపాలిటన్ సిటీలో స్థిరపడ్డారని పేర్కొన్నారు. ఎన్నో మతాలకు హైదరాబాద్ నెలవుగా మారిందన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 15 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు.

16 దేశాలకు చెందిన కైట్ ప్లేయర్స్‌తో పాటు వివిధ రాష్ట్రాల కైట్ ప్లేయర్స్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌లో పాల్గొంటారని వెల్లడించారు. వివిధ రకాల రంగుల పతంగులను ఎగురవేస్తారని తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు తమ ఇంట్లోనే తయారు చేసిన 400 రకాల స్వీట్లతో పాటు తెలంగాణ వంటకాలను పుడ్ కోర్టులో విక్రయిస్తారని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శిస్తారన్నారు. వీక్షకులకు ఉచిత ప్రవేశం ఉంటుందని, అందరూ ఆహ్వానితులే నని చెప్పారు. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కు ఆహ్వానించారు.

కైట్ ఫెస్టివల్‌ను పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తాం
రానున్న రోజుల్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించనున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. , తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు పూర్వ వైభవం తేనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యాటక శాఖ డైరెక్టర్ కె. నిఖిల్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, క్లిక్ (సిఎల్‌ఐసి) ప్రతినిధులు బెంజిమిన్, అభిజిత్, ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్ పవన్ సోలంకీ, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News