Wednesday, January 22, 2025

ఖమ్మంలో నిర్వహించే జన గర్జనను విజయవంతం చేయండి

- Advertisement -
- Advertisement -

వరంగల్ : జూలై 2న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ జన గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఎన్‌ఆర్‌ఐ, చెర్లపాలెం గ్రామానికి చెందిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని నాంచారిమడూరు గ్రామంలోని రెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీరెడ్డి పాల్గొని మాట్లాడుతూ జూలై 2న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో చేరబోతున్నట్లు తెలిపారు.

ఈ సభకు పాలకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వేలాది మందిగా తరలించాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఖమ్మంలో నిర్వహించే సభ ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని, పాలకుర్తిలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

ప్రతీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్యంగా ఉంటూ పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. సమావేశానికి ముందు పట్టణ కేంద్రంలోని ఐదవ వార్డులో సీతారామచంద్ర స్వామి, ఆంజనేయస్వామి ఆలయంలో, చింతలపల్లి గ్రామంలోని యాదవుల ఆరాద్య దైవం గంగాదేవి పండుగలో ఝాన్సీరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు.

ఈ సమావేశంలో తొర్రూరు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు హామ్యానాయక్, పాలకుర్తి బ్లాక్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మాజీ బ్లాక్ అధ్యక్షుడు కేతిరెడ్డి నిరంజన్‌రెడ్డి, తొర్రూరు మండల అధ్యక్షుడు జక్కుల రాంరెడ్డి, చెవిటి సదాకర్, రాయపర్తి మండల అధ్యక్షుడు మాచర్ల ప్రభాకర్, పెద్దవంగర మండల అధ్యక్షుడు ముద్దసాని సురేశ్, పాలకుర్తి మండల అధ్యక్షుడు గిరగాని కుమార్, కొడకండ్ల మండల అధ్యక్షుడు ధరావత్ సురేశ్‌నాయక్, తొర్రూరు మున్సిపాలిటీ ఒకటవ వార్డు కౌన్సిలర్ భూసాని రాము, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సుంచు సంతోశ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు జాటోతు రవినాయక్, మాజీ మార్కెట్ చైర్మన్ అనుమాండ్ల నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు చిత్తలూరి శ్రీనివాస్‌గౌడ్, సీనియర్ నాయకులు కందాడి అచ్చిరెడ్డి, మేకల కుమార్, తూనం శ్రావణ్, మిత్తింటి హరీశ్, సమ్మయ్య, మల్లారెడ్డి, సోమనర్సయ్య, గిరి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్‌నాయక్, ఎన్‌ఎస్‌యుఐ నియోజకవర్గ అధ్యక్షులు రాజేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News