Sunday, December 22, 2024

పొంగులేటి చేరిక సభను విజయవంతం చేయండి

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పొంగులేటి వర్గీయులు బొర్రా రాజశేఖర్, పొంగులేటి వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ విజయబాయి పిలుపునిచ్చారు. కారేపల్లి మండల కేంద్రంలోని వైఎస్‌ఎన్ గార్డెన్స్ లో బుధవారం మండల నాయకులు ,కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ముందుగా కారేపల్లి మెయిన్ రోడ్ లోని శ్రీ సీతారామ హోటల్ వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం, సినిమా హాల్ సెంటర్, బస్టాండ్ సెంటర్ వద్ద నుండి వై ఎస్ ఎన్ గార్డెన్స్ వరకు బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రెండవ తేదీ ఆదివారం ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సమక్షంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కారేపల్లి మండలం నుండి 10 నుండి 15 వేల మంది వరకు కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొర్రా రాజశేఖర్ , బానోత్ విజయబాయిల తో పాటు నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, మల్లెల నాగేశ్వరరావు, గుమ్మ రోశయ్య, మాదారం సర్పంచ్ అజ్మీర నరేష్ నాయక్, ఎండి హనీఫ్, ఎంపీటీసీ ఆలోత్ ఈశ్వరి బాయి, ఆదెర్ల స్రవంతి, నాగండ్ల జగన్, మాన్సింగ్, మండేపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News