Wednesday, January 22, 2025

తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయండి

- Advertisement -
- Advertisement -

దమ్మపేట/అశ్వారావుపేట : జులై 2వ తేదీన నిర్వహించే తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువార ఏర్పాటు చేసిన ఆ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహించి ప్రతి ఇంటి గడప తాకుతూ, ప్రతి గుండెను పలకరిస్తూ, మహిళలు, యవకులు, రైతులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, గొల్ల కురుమల, చిరు వ్యాపారస్తులు, చేనేత కార్మికులు, వృద్ధులు.. ఇలా అందరిని కలుస్తూ వారి కష్టాలు తెలుసుకుంటూ, వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ సమస్యలు పరిష్కరిస్తామని

హామీ ఇస్తూ పట్టు వదలని విక్రమార్కుడిలా పీపుల్స్ మార్చ్ చేపట్టి జులై 2వ తేదీతో ముగింపు సందర్భంగా తెలంగాణ జనగర్జన భారీ బహిరంగ సభకు ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారధులు విచ్చేస్తున్నారని, అశ్వారావుపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చండ్రుగొండ జడ్పీటీసీ కొనకళ్ల వెంకట్ రెడ్డి, సుంకవల్లి వీరభద్రరావు,పెటేటి నరసింహారావు, తాండ్ర బుచ్చిబాబు, సత్యనారాయణ చౌదరి, నల్లమోతు రమణ, చెరుకూరి రవి, మాజీ ఎంపీపీ పానుగంటి సత్యం,అత్తులూరి వెంకట రామారావు, జల్లిపల్లి కిషోర్, పద్ధం వినోద్, అంతటి రామకృష్ణ , బొర్రా సురేష్ , ఇనపనూరి రాంబాబు, చెల్లా రమేష్, మనోహర్ , గాదెగోని జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News