Thursday, January 23, 2025

తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయండి

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : తెలంగాణ జన గర్జన సభను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం సాయంత్రం సత్తుపల్లి లోని మువ్వా విజయ్ బాబు అవుట్ హౌస్‌లో గురువారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జులై 2 వ తారీకు జరిగే తెలంగాణ జనగర్జన సభను సత్తుపల్లి నియోజకవర్గం నుండి వేలాదిగా జన సమీకరణ చేయాలని నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులకు దిశా నిర్దేశం చేసారు.

ఈ సభకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, పొంగులేటి శీనన్న అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మువ్వా పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో పొంగులేటి బలపరిచిన అభ్యర్ధి కొండూరు సుధాకర్, సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జి మువ్వా విజయ్ బాబు, ఉడతనేని అప్పారావు, ఆయన అనుచరులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News