Sunday, December 22, 2024

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను గెలిపించండి : మహిళా కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డీసౌజ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, మహిళల ఆకాంక్షలను ప్రభుత్వం వంచించిందని విమర్శించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిపిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావ్‌తో కలసి ఆమె మాట్లాడారు. లక్ష రూపాయల పంట రుణ మాఫీ ఉసే లేదని, లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు మరోసారి మోసపోవద్దన్నారు. సామాజిక న్యాయం, అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం కాంగ్రెస్ పార్టీ కే సాధ్యమని ఆమె స్పష్టం చేశారు.
పోలీసు అధికారుల బదిలీలను సమీక్షించాలి : నిరంజన్
ఎన్నికలకు ముందు చేపట్టిన పోలీసు అధికారుల బదిలీలను సమీక్షించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ డిమాండ్ చేశారు. గతంలోనే ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని లాంగ్ స్టాండింగ్ ఉన్న అధికారులను బదిలీ చేయాలని సూచించిందన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల బదిలీలు ప్రభుత్వం వారికి అనుకూలంగా చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బదిలీలపై ఎన్నికల సంఘం సమీక్షించాలని కోరారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పోలీసులు పారదర్శకంగా పని చేసేలా ఉండాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News