Wednesday, January 22, 2025

యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • యోగా అనేది ఒక వ్యాయామం కాదు
  • తనువు, మనస్సు ఆత్మను ఏకం చేసే సాధనం
  • హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్

హుస్నాబాద్: ప్రతిఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకొని కలకాలం నిత్య ఆరోగ్య వంతులుగా జీవించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్టపై విద్యార్థులు , ప్రజలు, మహిళలతో కలిసి యోగసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి ఫలితం ఆశించకుండా చేసే కర్మ అద్భుతాలను సృష్టిస్తుందని అలా అని కర్మ చేయకుండా ఉండకూదడని నేరు నమ్మే సిద్దింతం నన్ను ముందుకు నడిపిస్తుందని విద్యార్థులకు బోధించారు. యోగాతో మానసిక , శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చని వయస్సుతో నిమిత్తం లేదని అన్నారు. యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది మన భారతదేశం అన్నారు. మన దేశ వారసత్య సంపదను భావితరాలకు అందిచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అయిలేని అనిత, ఏఎంసి చైర్మన్ ఎడబోయిన రజిని, కౌన్సిలర్లు కొంకటి నళినిదేవి, బోజు రమాదేవి, గోవింద రవి, కో ఆప్షన్ సభ్యులు అయిలేని శంకర్ రెడ్డి, ఎండి ఆయూబ్, మాజీ ఎంపిపి ఆకుల వెంకట్ , మాజీ ఎఎంసి చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండి. అన్వర్, వర్కింగ్ ప్రెసిడెండ్ చిట్టి గోపాల్ రెడ్డి, నాయకులు బోజు రవీందర్, శంషాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ అయిలేని శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News