Wednesday, January 22, 2025

ఉల్లాసంగా… ఉత్సాహంగా

- Advertisement -
- Advertisement -

నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ చివరి పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. మిగిలిన పాటను త్వరలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ రీరికార్డింగ్ వర్క్ పూర్తయింది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో నితిన్, కృతి శెట్టి ఉల్లాసంగా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. నితిన్, కృతిశెట్టి జోడి బ్యూటీఫుల్ అండ్ రెఫ్రెషింగ్‌గా వుంది. స్టిల్‌లో కనిపిస్తున్న ఈ పాటని యూరప్ లొకేషన్‌లో చిత్రీకరించారు. కేథరిన్ ఈ సినిమాలో మరో కథానాయికగా నటిస్తోంది.

Makers shooting Last Song in Macherla Niyojakavargam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News