Wednesday, January 22, 2025

ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ విడుదలకు ప్లాన్..

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇపుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్‌కి కూడా సిద్ధమై చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందుతుంది. అన్నీ బాగుండి ఉంటే ఈ సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలిచేది. ఇక ఈ భారీ సినిమా రిలీజ్ వాయిదా పడగా ఇప్పుడు మేకర్స్ సినిమా గ్రాఫిక్స్ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు.

కాగా, దర్శకుడు ఓంరౌత్ ‘ఆదిపురుష్’ రిలీజ్‌పై ఆసక్తికరమై కామెంట్స్ చేశాడు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ రిలీజ్ చేస్తామని, ఒక్క ఇంగ్లీష్‌నే కాకుండా గ్లోబల్‌గా నలుమూలల్లో సాధ్యమైనన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని ఓం తెలిపాడు. మరి ఈ చిత్రమయితే ప్రస్తుతానికి జూన్ రిలీజ్‌కి ప్లానింగ్‌లో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News