Sunday, December 22, 2024

తెలంగాణకు ‘టెస్లా’ను తీసుకురాడానికి ప్రయత్నిస్తున్నాము

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ఎలక్ట్రిక్ వెహికిల్ దిగ్గజం ‘టెస్లా’ను తెలంగాణకు తీసుకురాడానికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తోందని తెలంగాణ ఐటి, పారిశ్రామిక మంత్రి డి. శ్రీధర్ బాబు గురువారం తెలిపారు. 2023 డిసెంబర్ నుంచే తెలంగాణ ప్రభుత్వం టెస్లా తెలంగాణలో పెట్టుబడి పెట్టేలా ప్రయత్నిస్తోందన్నారు. టెస్లా కంపెనీతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామన్నారు. శ్రీధర్ బాబు తన ట్వీట్ ను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కు కూడా ట్యాగ్ చేశారు.

టెస్లా కంపెనీ దేశంలో రెండు లేక మూడు బిలియన్ డాలర్లతో ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్ ను నెలకొల్పేందుకు చూస్తోందని, తెలంగాణ ప్రభుత్వం ఈ అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు అన్ని విధాల ప్రయత్నించాలని మాజీ ఐటి, పరిశ్రమల మంత్రి కె.టి.రామారావు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన కొన్ని గంటలకే మంత్రి ఎక్స్ పోస్ట్ తెరపైకి వచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News