Tuesday, November 5, 2024

చెడు నుంచి మంచి

- Advertisement -
- Advertisement -

కుళ్లిన కూరగాయల నుంచి విద్యుత్
తయారుచేస్తున్నారు ప్రతి రోజూ 500యూనిట్ల
విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది సుమారు 30కిలోల
జీవ ఇంధనం తయారవుతున్నది మార్కెట్‌కు
వెలుగును ఇస్తున్నది జీవ ఇంధనంతో మార్కెట్
క్యాంటిన్‌లో ఆహారం చేస్తున్నారు ఇది వ్యర్థాల
నుంచి బంగారం తయారుచేసే దిశగా ప్రయాణం
మన్‌కీ బాత్‌లో ప్రధాని మోడీ ప్రశంసలు

 Making electricity from waste vegetables

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్‌లో హైదరాబా ద్ బోయిన్‌పల్లిలోని స్థానిక కూరగాయల మార్కెట్ త మ బాధ్యతల ను నెరవేర్చే విధానాన్ని చదవడం కూడా నాకు చాలా సంతృప్తిని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. కూరగాయల మార్కెట్లలో చాలా కారణాల వల్ల చాలా కూరగాయ లు చెడిపోతాయని మనం అంద రం చూశాం. ఈ కుళ్లిపోయి న కూరగాయలు ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తాయి. వీ టి ద్వారా అపరిశుభ్రత కూడా వ్యాపిస్తుంది. కాని బోయిన్‌ప ల్లి కూరగాయల మార్కెట్ ఇలా రోజువారీ కూరగాయలను విసిరివేయకూడదని నిర్ణయించుకుంది.

కూరగాయల మార్కెట్‌తో సంబంధం ఉన్న ప్రజలు వీటితో విద్యుత్తును సృష్టించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం అని తెలిపారు. వ్యర్థ కూరగాయల నుండి విద్యుత్తును తయారు చేయడం గురించి మీరు ఎప్పుడైనా విని ఉంటారు. ఇది నవ కల్పన శక్తి. బోయినపల్లి మార్కెట్లో ఉన్న వ్యర్థాల నుండి నేడు సంపద సృష్టి జరుగుతోంది. ఇది వ్యర్థాల నుండి బంగారం తయారుచేసే దిశగా ప్రయాణం’ అని ప్రధాని మోదీ కొనియాడారు. అక్కడ ప్రతి రోజు 10 టన్నుల వ్యర్థ పదార్థాలు తయారవుతున్నాయి. ఈ వ్యర్థాలను ఒక ప్లాంట్‌లో సేకరిస్తారు. ప్లాంట్ లోపల ఈ వ్యర్థాల నుండి ప్రతిరోజూ 500 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. సుమారు 30 కిలోల జీవ ఇంధనం కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ కాంతే కూరగాయల మార్కెట్‌కి వెలుగుని ఇస్తుంది. అక్కడ ఉత్పత్తి అయిన జీవ ఇంధనం నుండి ఆ మార్కెట్‌లోకి క్యాంటీన్‌లో ఆహారాన్ని తయారు చేస్తారు. ఇది అద్భుతమైన ప్రయత్నం కదూ…! అంటూ మోదీ ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News