Friday, December 27, 2024

ఐటి రీఫండ్‌ల కోసం అతిశయోక్తి, బోగస్ క్లెయిమ్‌లు చేయడం క్రిమినల్ నేరం: ఐటి  శాఖ

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐటి శాఖ ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలర్లను ఖర్చుల కోసం బోగస్ క్లెయిమ్‌లు చేయవద్దని, వారి ఆదాయాలను తక్కువగా నివేదించవద్దని లేదా తగ్గింపులను అధికం చేయవద్దని కోరింది. ఇది శిక్షార్హమైన నేరం , రీఫండ్‌ల జారీలో జాప్యం కలిగిస్తుందని పేర్కొంది.

ఆడిట్ చేయాల్సిన అవసరం లేని ఖాతాదారుల అసెస్‌మెంట్ సంవత్సరం 2024-25 ఐటిఆర్ ఫైలింగ్ సీజన్ చివరి తేదీ జూలై 31న ముగుస్తుంది. ఆదాయపు పన్ను శాఖ , దాని అడ్మినిస్ట్రేటివ్ బాడీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రకారం, జూలై 26 నాటికి ఐదు కోట్లకు పైగా ఐటిఆర్‌లు దాఖలయ్యాయి.

ఐటిఆర్ సమర్పించే పన్ను చెల్లింపుదారులు మూలం వద్ద పన్ను కోత(టిడిఎస్) తిరిగి పొండం(రీఫండ్) కోసం ఎక్కువ, తక్కువ చేసి చూపకూడదని ఐటి శాఖ హెచ్చరించింది. పన్ను చెల్లింపుదారులు సరైన, తప్పులు లేని వివరాలనే పేర్కొనాలని తెలిపింది. తప్పుడు క్లయిములు చేస్తే శిక్షార్హులవుతారని హెచ్చరించింది.

కొత్త పన్ను విధానంలో పన్ను విధానాన్ని మెరుగ్గా, సులభరీతిలో రూపొందించామని సిబిడిటి చైర్మన్ రవి అగర్వాల్ ఇటీవల పిటిఐకి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News