చర్మ సంరక్షణ, చర్మ రక్షణ కోసం చాలామంది అనేక చిట్కాలను అనుసరిస్తారు. ముఖ్యంగా సూర్యరశ్మి వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని నివారించడానికి సన్ స్క్రీన్ ను అప్లై చేస్తారు. మరికొందరు చర్మం దెబ్బతినకుండా కాపాడుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇంట్లోనే సన్ స్క్రీన్ ను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? సహజ సన్ స్క్రీన్ ను తయారు చేసే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అలోవెరా జెల్, కొబ్బరి నూనె
అలోవెరా జెల్, కొబ్బరి నూనె సహాయంతో సన్‌స్క్రీన్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం పావు కప్పు తాజా అలోవెరా జెల్ తీసుకోవాలి. తర్వాత అందులో ఒక చెంచా కొబ్బరి నూనె కలపాలి. దీనిలో 10-15 చుక్కల పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా కలపాలి. ఇప్పుడు దీని బాగా కలిపి మందపాటి పేస్ట్ లాగా తయారు చేయాలి. ఇప్పుడు మార్కెట్లో లభించే సన్‌స్క్రీన్‌ల మాదిరిగానే వీటిని వాడవచ్చు.
అలోవెరా, విటమిన్ ఇ క్యాప్సూల్స్
విటమిన్ ఇ క్యాప్సూల్స్ చర్మ సంరక్షణకు ఎంతో మంచివి. విటమిన్ ఇ క్యాప్సూల్స్, కలబంద జెల్ కలిపి సన్‌స్క్రీన్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఒక చెంచా కలబంద జెల్ తీసుకోవాలి. అందులో 4-5 చుక్కల విటమిన్ ఇ క్యాప్సూల్ వేయాలి. తర్వాత అందులో సన్‌ఫ్లవర్ ఆయిల్ కలపాలి. ఇప్పుడు వీటిని బాగా కలపాలి. మార్కెట్లో లభించే సన్‌స్క్రీన్‌ల మాదిరిగానే వీటిని ఉపయోగించవచ్చు.