Monday, December 23, 2024

రంగునీళ్లతో ఐస్ క్రీంల తయారి..

- Advertisement -
- Advertisement -

తాండూరు : రంగు నీళ్లతో ఐస్‌క్రీం లు తయారి చేసి ప్రజలు రోగాల బారిన పడే విధంగా చేస్తున్నారు. తాండూరులోని లారీ పార్కింగ్ ఎదురుగా విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న కాలనీలో నాసిరకం ఐస్ క్రీంలు తయారు చేస్తున్నారు. వారం రోజుల క్రితం తాండూరు టాస్క్‌ఫోర్సు అధికారులు దాడులు చేసి ఆయా ఐస్ క్రీం దుకాణాల్లో నాసి రకం కలర్ డబ్బాలను స్వాధినం చేసుకున్నారు. దాడులు చేపట్టి వారం జరగక ముందే యదావిధిగా నాసిరకం ఐస్ క్రీంలు తయారు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎండా కాలం కావడంతో ప్రతి ఒక్కరు చల్లగా ఉండేందుకు ఐస్‌క్రీం తినేందుకు ఇష్టపడతారు.

ఎక్కువగా చిన్నపిల్లలు ఐస్ క్రీంలు తీనేందుకు మొగ్గుచూపుతారు. మురికి నీరు, నాసిరకం పదార్థాలు, వివిధ రకాల కలర్‌లతో ఐస్ క్రీంలు తయారు చేస్తూ ప్రజలు రోగాల బారిన పడేందుకు కారణమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ అనుమతు ఒక విధంగా పొంది మరో రకంగా లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో నాసిరకం ఐస్ క్రీంలు తయారు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి రోజు భారీ స్థాయిలో నాసిరకం ఐస్ క్రీంలు తయారి చేసి పట్టణం, గ్రామీణ ప్రాంతాలలో విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాండూరులోని విద్యుత సబ్‌స్టేషన్ ముందు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఉన్న ఐస్‌క్రీం దుకాణాలపై టాస్క్‌ఫోర్సు అధికారులు దాడులు జరిపి హెచ్చరించారు.

అయిన్నప్పటికి వ్యాపారుల్లో ఎలాంటి మార్పు రాలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. నాసిరకంగా తయారి చేసిన ఐస్‌క్రీంలను వివిధ పేర్లతో కూడిన కంపెనీల బాక్సులో ప్యాకింగ్ చేసి విక్రయాలు చేస్తున్నారు. ఇదంతా భహిరంగంగానే జరుగుతున్నప్పటికి సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. నాసిరకం ఐస్‌క్రీంలు తయారి చేసి రోజు లక్షల మేరకు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత అధికారులు లేదా పోలీసులు ఐస్ క్రీం దుకాణాలపై తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News