Monday, March 31, 2025

కుళ్లిన పదార్థాలతో స్వీట్లు

- Advertisement -
- Advertisement -

కాలం చెల్లిన పదార్థాలతో
స్వీట్ల తయారీ
అధికారుల తనిఖీల్లో
బయటపడ్డ అమన్
స్వీట్ల కంపెనీ బాగోతం
పాడైన స్వీట్లను రీసైకిల్
చేస్తున్న యాజమాన్యం
కంపెనీ అనుమతులను
రద్దు చేసిన అధికారులు
నాచారం పరిధిలోని
మల్లాపూర్‌లో ఘటన

పండగొచ్చిన, పబ్బం వచ్చిన నోరు తీపి చేసుకునే ముందుగా గుర్తుకు వచ్చేది స్వీట్లు. కంపెనీ నుండి కొనుగోలు చాలా తక్కువ అని లోట్టలు వేసుకుంటూ తిందామనుకున్న స్వీట్లను తింటే ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్టే. కాల పరిమితి దాటిన స్వీట్లను తయారు చేసే కంపెనీ మరెక్కడో కాదు నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ డివిజన్ పారిశ్రామిక వాడలోనే ఉంది. అమన్ స్వీట్ల తయారీ కంపెనీపై అనుమానంతో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు అమన్ స్వీట్స్ తయారీ కంపెనీలో శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా కంపెనీలో ఉన్న స్వీట్లను, తయారీ చేసే స్ధలం, వాటి పరిసరాలను చూసి అధికారులు ముక్కులు మూసుకున్నారు. ఇష్టానురీతిలో కుళ్లిన పదార్ధాలతో కాలం చెల్లిన తినుబండారాలతో అమ్మకం కానీ పురాతన స్వీట్లను రీసైకిల్ చేస్తూ తయారీ చేస్తున్న స్వీట్లను సైతం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.

తయారీ చేసుకుంటూ కుప్పలు కుప్పలుగా డబ్బాల్లో నిల్వ ఉంచిన వాటిలో వచ్చే దుర్వాసనతో పూర్తి స్ధాయిలో చెడిపోయిన పదార్ధాలు సైతం వాటిని సైతం పరిశీలించగా అవి కాలం చెల్లిపోయినవని అధికారులు తెలిపారు. కంపెనీ అనుమతి తీసుకున్నది ఇతర జిల్లాలో తీసుకున్న అనుమతి పత్రంతో మల్లాపూర్ డివిజన్‌లో కంపెనీ ఏర్పాటు చేసి, స్వీట్ల తయారీ చేపడుతున్నారని, సరైన అనుమతి లేని కంపెనీలో అక్రమంగా తినుబండారాలు అమ్మకాలు చేపడుతున్నారని అధికారులు మండిపడ్డారు. కుళ్లిన పదార్ధాలను డంప్ చేయించి, సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని పరిశీలించి, అనుమతి రద్దు చేసి, ఫుడ్ శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపినట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. కంపెనీ యజమాని మాత్రం అందుబాటులో లేడని, కార్మికులు మాత్రమే సమాధానం ఇవ్వడం గమనార్హం. ఫుడ్ శాంపిల్ టెస్ట్ అనంతరం వచ్చిన రిపోర్టు ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News