- Advertisement -
హైదరాబాద్ : హైదరాబాద్ మక్కా మసీదు ఇమామ్, ఇస్లామిక్ పండితుడు.. హఫీజ్ మౌలానా మహమ్మద్ ఉస్మాన్ నక్ష్‌బందీ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. ఇమామ్‌గా సుమారు 50 సంవత్సరాలు పనిచేసిన వారి సేవలు గొప్పపని సిఎం అన్నారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచీ మౌలానా కృషి, వారితో తనకున్న అనుబంధాన్ని సిఎం స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. మౌలానా కుటుంబ సభ్యులకు సిఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
- Advertisement -