Monday, January 20, 2025

మలబార్ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మరోసారి జూ.ఎన్‌టిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రముఖ జువెలరీ రిటైలర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ మాస్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్‌టిఆర్‌తో ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నట్టు ప్రకటించింది. ఇకపై మలబార్ గోల్డ్ ప్రచార చిత్రాల్లో జూ.ఎన్‌టిఆర్ వినియోగదారులను ఆకట్టుకోనున్నారు.

బ్రాండ్ అంబాసిడర్‌గా జూ.ఎన్‌టిఆర్ రెండో ఇన్నింగ్స్‌తో మలబార్ గోల్డ్ 30వ వార్షికోత్సవం జరుపుకోనుంది. జూనియర్ ఎన్‌టిఆర్ మాట్లాడుతూ, మరోసారి మలబార్ గోల్డ్‌తో భాగస్వామ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్ల సంఖ్యను పెంచుకోవాలనే లక్షంలో భాగంగా సూపర్ స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మలాబార్ గ్రూప్ చైర్మన్ ఎంపి అహ్మద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News