Sunday, December 22, 2024

మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్‌నటి, మోడల్ మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా బుధవారం ఉదయం ముంబైలోని ఒక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 65 సంవత్సరాల అనిల్ అరోరా ఉదయం 9 గంటల ప్రాంతంలో తాను నివసిస్తున్న భవనంలోని ఆరవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు అక్కడకు చేరుకుని అనిల్ అరోరాను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారని ఆయన చెప్పారు.

అనిల్ అరోరా ఆత్మహత్యకు కచ్ఛితమైన కారణం ఏమిటో తెలియరాలేదని, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు. భవనం ప్రాంగణంలో ఉన్న సిసిటివి ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.ఘటన గురించి తెలిసిన వెంటనే మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ ఘటనా స్థలికి చేరుకున్నారు. కాగా..మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా నేటి ఉదయం మరణించిన వార్త నిజమే అయినప్పటికీ ఆయన ఆత్మహత్య చేసుకోలేదని ఆయన కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదంలో ఆయన మరణించారని, ఎటువంటి అనారోగ్య సమస్యల ఏని అనిల్ అరోరా మృతి వార్త తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని వారు చెప్పారు. తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే మలైకా అరోరా అక్కడకు చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News