Friday, December 20, 2024

ఆస్కార్ వేడుకల్లో మెరిసిన మలాలా

- Advertisement -
- Advertisement -

లాస్‌ఏంజెల్స్: పాకిస్థాన్‌కు చెందిన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ ఆస్కార్ వేడుకల్లో మెరిశారు. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన అకాడమీ అవార్డులో హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ అడిగిన ప్రశ్నకు మలాలా ఇచ్చిన సమాధానం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మలాలా సైతం వీడియో క్లిప్‌ను ‘ప్రజలతో దయతో ప్రవర్తించండి’ అనే శీర్షికతో రీట్వీట్ చేశారు. మలాలా తన భర్త అస్సర్ మాలిక్‌తో కలిసి ఆస్కార్ వేడుకలుకు హాజరుకాగా క్రిస్‌పైన్, హ్యారీ స్టైల్స్‌కు సంబంధించిన స్పిట్‌గేట్ వివాదం గురించి కిమ్మెల్‌ను ఆమెను అడిగారు. ‘మానవ హక్కులు, స్త్రీలు, పిల్లల విద్యపై మీ కృషి ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.

చరిత్రలో అతిపిన్న వయస్సులోనే నోబెల్ బహుమతి విజేతగా నిలవడం ఆశ్చర్యపరిచింది. హ్యారీ స్టైల్స్ క్రిస్‌పైన్‌పైన ఉమ్మివేసినట్లు మీరు అనుకుంటున్నారా?అని జిమ్మీ ప్రశ్నించారు. జిమ్మీ ప్రశ్నకు స్పందించిన మలాలా.. తను శాంతి గురించి మాత్రమే మాట్లాడతాను అని బదులివ్వడంతో ఆహూతులు హర్షం వ్యక్తం చేశారు. కాగా డార్లింగ్ చిత్రంప్రదర్శనలో హ్యారీస్టైల్స్ క్రిస్‌పైన్‌పై ఉమ్మివేసినట్లు వివాదం చెలరేగింది. దీన్ని స్పిట్‌గేట్ కాంట్రావర్సీగా పేర్కొంటారు. అయితే హ్యారీ తనపై డోంట్‌వర్రీ డార్లింగ్ చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా ఉమ్మి వేయలేదనిక్రిస్‌పైన్ ఓ ఇంటర్వూలో స్పిట్‌గేట్ వివాదంపై స్పష్టతనిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News