Monday, January 20, 2025

పాలస్తీనియన్లకు మలాల సంఘీభావం

- Advertisement -
- Advertisement -

లండన్ : పాకిస్థాన్‌కు చెందిన సంచలనాత్మక మహిళ నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ గాజా ఆసుపత్రి దాడిపై తీవ్రంగా స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండించిన మలాలా బాధితులకు తమ వంతుగా రూ 2.5 కోట్లు సాయం ప్రకటించారు. గాజాలోని బాధితులలో అత్యధికులు 18 సంవత్సరాల్లోపు వారే. వారి బతుకులన్ని బాంబుదాడుల మధ్య బందీ కాకూడదని ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న మలాల ఓ ప్రకటన వెలువరించారు. వారి బాధలతో తాను పాలుపంచుకుంటున్నానని తెలిపి

ఓ వీడియో సందేశం వెలువరించారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనాల్సి ఉంది. దారుణాలకు సామాన్యులు, చిన్నారులు బలి అవుతున్నారని, దీనిపై మానవీయ కోణంలో స్పందిస్తున్న వారితో తానూ ముందుకు సాగుతానని ఆమె ప్రకటించారు. గాజాలో బాధితులకు సాయం అందించేందుకు రంగంలోకి దిగిన మూడు స్వచ్చంద సంస్థలకు తమ నుంచి 3లక్షల డాలర్ల సాయం పంపిస్తున్నట్లు తెలిపారు. ఏదో ఒక నేరం జరిగిందని ఎవరూ సామూహిక శిక్షకు పాల్పడరాదని మలాల పిలుపు నిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News