Friday, December 20, 2024

అమ్మాయిగా పుట్టడమే నేరంగా మార్చారు

- Advertisement -
- Advertisement -

జోహాన్నెస్‌బర్గ్: అఫ్గానిస్థాన్‌లో మహిళలపై తాలిబన్లు విధించిన ఆంక్షలను నోబెల్ వాంతి బహుమతి గ్రహీత మలాల యూసఫ్‌జాయ్ దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష పాలనలో నల్లజాతి వారు అనుభవించిన కష్టాలతో పోల్చారు. జోహాన్నెస్‌బర్గ్‌లో 21వ నెల్సన్ మండేలా వార్షిక ప్రసంగం సందర్భంగా మలాల మాట్లాడుతూ ‘ ఒక వేళ మీరు అఫ్గానిస్థాన్‌లో అమ్మాయి అయితే తాలిబన్ మీ భవిష్యత్తును నిర్ణయించేస్తుంది. మీరు సెకండరీ స్కూలుకు లేదా యూనివర్సిటీకి వెళ్లరాదు. మీరు బహిరంగ లైబ్రరీలో చదవడానికీ వీలు లేదు. మీ అమ్మలు, అక్కలు ఇళ్లకే పరిమితమై బందీలుగా, నిర్బంధింపబడి ఉండడాన్ని కూడా మీరు చూస్తారు’ అని ఆమె అన్నారు. తాలిబన్ల చర్యలను లింగ వివక్షగా పరిగణించాలని ఒక విధంగా తాలిబన్లు అమ్మాయిగా పుట్టడమే నేరంగా చేసిందని ఆమె అంటూ, ప్రపంచ దేశాలు తాలిబన్లతో మామూలు సంబంధాలు పెట్టుకోరాదని అన్నారు. తాలిబన్ ప్రభుత్వం చివరికి బాలురనుంచి సైన్స్, క్లిష్టమైన ఆలోచనా ధోరణిని కూడా లాగేసుకుంటుందేమోనని తాను ఆందోళన చెందుతున్నట్లు మలాల అన్నారు.

‘అమ్మాయిలకు చదువుకునేందుకు అవకాశం ఉండేలా చూడడంతో పాటుగా అది నాణ్యమైన విద్యగా ఉండేలా ప్రపంచ దేశాలు చూడడం చాలా ముఖ్యం.అది ఉపదేశంలాగా ఉండరాదు’ అని ఆమె అన్నారు. పాకిస్తాన్‌లో తాలిబన్లు బాలికలకు చదువుకునే హక్కును నిరాకరించినందకు వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు 15 ఏళ్ల వయసులో మలాలపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తలకు తీవ్ర గాయమైన ఆమె ప్రాణాలతో బైటపడింది. ఆ తర్వాత ఆమె 2014లో నోబెల్ శాంతి బహుమతిని కూడా అందుకుంది.2014లో అఫ్గాన్‌లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పటినుంచి తాలిబన్లు అక్కడ మహిళా సిబ్బంది సహాయ ఏజన్సీల్లో పని చేయడాన్ని ఆపేయడంతో పాటుగా బ్యూటీ సెలూన్లను మూసి వేయడంతో పాటుగా పార్కులకు వారు వెళ్లడాన్ని కూడా నిషేధించింది. అంతేకాకుండా మగవాళ్లు తోడు లేకుండా మహిళలు ప్రయాణాలు చేయడంపైన కూడా ఆంక్షలు విధించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News