Tuesday, November 26, 2024

దళితబంధు రెండో విడతలో మాలలకు అధిక ప్రాధాన్యం కల్పించాలి

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ: దళిత బంధు రెండో విడతతో పాటు, హౌసింగ్ గృహలక్ష్మి పథకం ద్వారా వచ్చే ఆర్థిక సహాయంలో మాలలకు అధిక ప్రాధాన్యత కల్పించాలని మాల సంఘాల జేఏసి చైర్మన్ చెరుకు రాంచందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం జేఏసి ఆధ్వర్యంలో 33 జిల్లాల నేతలతో ఏర్పాటు చేసిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. మాలల సమస్యలు పరిష్కరించడంతో పాటు అన్ని పార్టీలు రాజకీయరంగంలో ప్రాధాన్యత కల్పించాలని వెల్లడించారు. ఈనెల 5న “చలో నల్గొండ” పేరుతో దేవరకొండలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని అన్నారు.

నామినేటెడ్ పోస్టుల్లో మాలలకు ప్రాధాన్యత ఇవ్వాలని, మాలల భవనం కోసం జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలిలో 5 ఎకరాల భూమిని కేటాయించి రూ.10 కోట్ల నిధులు ఇవ్వాలని చెప్పారు. భాగ్యరెడ్డి వర్మ కాంస్య విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయాలని అన్నారు. లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవనాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. మాలల సమస్యలు పరిష్కరించకుంటే రాబోయే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి దింపుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే సాయన్న, గాయకుడు సాయిచంద్‌లకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడం దురదృష్టకరమని వాపోయారు. ఈ కార్యక్రమంలో జేఏసి నేతలు రావుల అంజయ్య, మంత్రి నర్సింహ్మయ్య, జి. వినోద్‌కుమార్, బి. బాలకిషన్, ఎం. భాస్కర్, జి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News