Sunday, December 22, 2024

చాలా డిఫరెంట్ రోల్ చేశా: హీరోయిన్ మాళవిక నాయర్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో ట్యాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలని పెంచింది. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో కథానాయిక మాళవిక నాయర్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘అన్నీ మంచి శకునములే’ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?
ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలు కొంచెం సున్నితత్వంలోనే వుంటాయి. కానీ ‘అన్నీ మంచి శకునములే’ లో మాత్రం కొంచెం భిన్నంగా వుంటుంది. నా పాత్ర చాలా ఆర్గనైజడ్ గా వుంటుంది. ధైర్యం, కోపం స్పష్టంగా ప్రదర్శించే పాత్ర. అన్నీ తన చేతిలో ఉండాలనుకునే పాత్రలో కనిపిస్తా.

ఇందులో మీ పాత్ర నిజ జీవితంలో ఎవరికైనా సిమిలర్ గా ఉంటుందా ?
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లో నా ఆనంది పాత్ర ప్రియాంక గారికి దగ్గరగా వుంటుంది. తను హిప్పీ, ఫ్రీ ఫ్లోయింగ్. స్వప్న గారు మాత్రం చాలా ఆర్గనైజడ్ లీడర్. ఇందులో పాత్ర స్వప్న గారికి దగ్గరగా వుంటుంది.

‘అన్నీ మంచి శకునములే’ షూటింగ్ అనుభవాలు గురించి చెప్పండి ?
కూనూర్ హిల్ స్టేషన్ లో చాలా భాగం షూట్ చేశాం. దాదాపు నెల రోజులు అక్కడే వున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు, గౌతమి గారు, నరేష్ గారు, వాసుకి.. ఇలా చాలా మంచి అనుభవజ్ఞులైన నటులతో కలసి నటించడం, వారితో సమయం గడపం చాలా మంచి అనుభూతి. సినిమా గురించే కాకుండా చాలా అంశాలు గురించి మాట్లాడుకునేవాళ్ళం.

‘అన్నీ మంచి శకునములే’ టైటిల్ విన్నపుడు దాని అర్ధం తెలుసా ?
తెలుసు. మలయాళంలో కూడా దాదాపు అలానే పలుకుతారు. నందిని గారు టైటిల్స్ అన్నీ చాలా పాజిటివ్ గా వుంటాయి. ఈ కథని నందిని గారు రెండేళ్ళు క్రితమే చెప్పారు. మంచి మంచి మార్పులతో అద్భుతమైన కథగా రూపొందింది.

మీ కెరీర్ పరంగా అన్నీ మంచి శకునములే అని ఎప్పుడు అనిపించింది ?
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చేసినప్పుడు అనిపించింది. ఆ సినిమా విలువ తర్వాత తెలిసింది. అది పాత్ బ్రేకర్. అక్కడి నుంచే స్వప్న గారు, ప్రియాంక గారు పరిచయమయ్యారు.

ఇప్పుడు చాలా సినిమాలు అమ్మాయి- అబ్బాయి కుటుంబంతో ముడిపడిన కథలు వస్తున్నాయి కదా..ఇలాంటి సమయంలో కథని యూనిక్ గా చేయడం ఒక సవాల్ కదా ?
ఈ ప్రశ్నకు ఫిల్మ్ మేకర్స్ బెటర్ గా సమాధానం ఇస్తారు. అయితే ఒక నటిగా పాత్ర చేస్తున్నానంటే కొత్తదనం చాలా ముఖ్యం. అది లేకుండా నేను చేయలేను. ప్రతి సినిమా ఒకేలా వుంటే బోర్ కొడుతుంది. అందరూ చేస్తున్నారు కదా.. అందులో నేను చేసేది ఏముంది అనిపిస్తుంది. నేను చేస్తున్నానంటే ఖచ్చితంగా వైవిధ్యం ఉండాలి.

ఈ పాత్ర చేయడానికి నందిని రెడ్డి గారు ఎలాంటి ఇన్ పుట్స్ ఇచ్చారు?
నందిని రెడ్డి గారు చాలా ఇన్ పుట్స్ ఇచ్చారు. డైరెక్టర్ గా తన విజన్ ని పంచుకుంటారు. అవి అర్ధం చేసుకుని ప్రేక్షకులు నచ్చేలా పాత్రని చేసే భాద్యత యాక్టర్ పై వుంటుంది. ఇందులో నా పాత్రలో హ్యుమర్ కూడా వుంది.

‘అన్నీ మంచి శకునములే’ సినిమా చేయడానికి మీ ఫస్ట్ మోటివేషన్ ?
నందిని గారితో మళ్ళీ పని చేయాలని వుండేది. అలాగే వైజయంతి ఫిలిమ్స్ స్వప్న గారు ప్రియాంక గారు కలసి రావడం నా అదృష్టం. వారి క్రియేటివ్ ఇన్ ఫుట్ అద్భుతంగా వుంటుంది. పిల్లల్ని పేరెంట్స్ సపోర్ట్ చేసినట్లుగా సపోర్ట్ చేస్తారు.

ఫారిన్ లోకేషన్స్ లో షూట్ చేశారు. మీ లుక్ కూడా హాలీవుడ్ హీరోయిన్ లా వుంది. లుక్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు?
థాంక్స్ అండీ. మా పేరెంట్స్ చాలా గర్వపడతారు(నవ్వుతూ) లుక్ పరంగా నేను పెద్దగా ఏమీ చేయను. డైట్ చూసుకుంటాను. ఈ లుక్ కి కారణం జెనిటిక్స్ అని నమ్ముతాను. నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తాను.

మీ నటనకి ఎప్పుడూ మంచి మార్కులు పడతాయి. కానీ సినిమా పరాజయం అయినప్పుడు ఎలా చూస్తారు?
కొన్ని మన చేతుల్లో వుండవు. నటన నా కంట్రోల్ వుంటుంది. కథలు, ఫిల్మ్ మేకర్స్ ని ఎంచుకోవడం నా చేతుల్లో వుంటుంది. కానీ కొన్ని సార్లు వర్క్ అవుట్ కాకపోవచ్చు. దాన్ని పర్శనల్ గా తీసుకొను.

సంతోష్ శోభన్ తో కలసి పని చేయడం ఎలా అనిపించిది ?
సంతోష్ నేను ఫ్రెండ్స్ లా కలసి పని చేశాం. సంతోష్ కి అస్సలు ఇగో లేదు. చాలా మంచి వాతావరణంలో వర్క్ చేశాం.

నందిని రెడ్డి గారు సినిమాల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ని ఎలా తీసుకొస్తారు ?
నిజంగా నాకు ఐడియా లేదు. ఆమె చాలా పాజిటివ్ వుంటారు. నటుల నుంచి ఏం కావాలో, ఎలా రాబట్టుకోవాలో ఆమెకు తెలుసు.

నటిగా మీ గోల్స్ ఏమిటి ?
ఒక యాక్షన్ సినిమా చేయాలని వుంది. అది నాకు చాలా ఇష్టం.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
డెవిల్ సినిమాలో ఆసక్తికరమైన పాత్ర చేస్తున్నాను.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News