Wednesday, January 22, 2025

మలయాళ సినీ నటి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: ప్రముఖ మలయాళ సినీ, టివి సీరియల్ నటి అపర్ణ నాయర్ మరణించారు. ఉరివేసుకున్న స్థితిలో ఆమె మృతదేహం గురువారం రాత్రి ఆమె ఇంట్లో లభించింది. 33 ఏళ్ల అపర్ణ నాయర్ కొన్ని మలయాళ సినిమాలు, అనేక సీరియల్స్‌లో నటించారు.

ఇక్కడి కరమన సమీపంలోని ఆమె ఇంట్లో ఆమె మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. భర్త, ఇద్దరు పిల్లలతో కలసి అపర్ణ ఆ ఇంట్లో నివసిస్తున్నారు. గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఉరివేసుకుని ఉన్న ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా తమకు అక్కడి నుంచి సమాచారం అందినట్లు పోలీసులు చెప్పారు.

అసహజ మరణంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కుటుంబ తగాదాల కారణంగానే అపర్ణ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News