- Advertisement -
మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు టీపీ మాధవన్(88) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య, పలు అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆయన కొల్లంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొదుతూ చనిపోయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. మాధవన్ మృతి పట్ల కేరళ సిఎం పినరయి విజయన్, పలువురు నటులు సంతాపం తెలిపారు.
కాగా, 1975లో రాగం అనే సినిమాతో మాధవన్ తన కెరీర్ ను ప్రారంభించారు. ఆయన 2016లో విడుదలైన ‘మాల్గుడి డేస్’లో చివరగా నటించారు. బహుముఖ పాత్రలకు పేరుగాంచిన మాధవన్ దాదాపు 600కు పైగా చిత్రాల్లో నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజా కృష్ణ మీనన్ ఆయన కుమారుడే. హిందీలో పిపా, చెఫ్,ఎయిర్ లిఫ్ట్ వంటి భారీ చిత్రాలను రాజా డైరెక్ట్ చేశాడు.
- Advertisement -