Thursday, January 16, 2025

రేప్ కేసులో మలయాళ నిర్మాత విజయ్ బాబు అరెస్టు

- Advertisement -
- Advertisement -

Malayalam Actor Vijay babu arrested in Rape Case

కోచ్చి: కేరళలో సినీ నటిపై అత్యాచారం కేసులో దర్యాప్తును ఎదుర్కొంటున్న మలయాళ సినీ నిర్మాత, నటుడు విజయ్ బాబును ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న కోచ్చి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఈ నెల 22న కేరళ హైకోర్టు నుంచి ముందస్తు జామీను పొందిన విజయ్ బాబును అరెస్టు చేసిన పోలీసులు ఆయన అరెస్టును నమోదు చేసి హైకోర్టు విధించిన షరతుల మేరకు విడుదల చేస్తామని తెలిపారు. జూన్ 27 నుంచి జులై 3వరకు విజయ్ బాబు పోలీసు కస్టడీలోనే ఉన్నట్లు పరిగణించాలని హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఇదివరకు తెలిపింది.

కస్టడీ సమయంలోనే బాబును నేరం జరిగినట్లు ఆరోపిస్తున్న ప్రదేశానికి తీసుకువెళ్లి సాక్ష్యాలను సేకరిస్తామని పోలీసులు తెలిపారు. విజయ్ బాబు నిర్మించిన చిత్రాలలో నటించిన నటి ఒకరు తనపై బాబు అత్యాచారానికి పాలడినట్లు ఏప్రిల్ 22న పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు గత నెలరోజులుగా తనపై బాబు జరిపిన అత్యాచారాన్ని, లైంగిక దోపిడీని వివరిస్తూ ఫేస్‌బుక్ వేదికగా వివరించారు.

Malayalam Actor Vijay babu arrested in Rape Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News