Monday, December 23, 2024

మలయాళ నటి సుబి సురేష్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: మలయాళ సినీ నటి, టివి సీరియల్స్ నటి, టివి వ్యాఖ్యాత సుబి సురేష్ బుధవారం కేరళలో కన్నుమూశారు. 41 సంవత్సరాల సుబి సురేష్ కాలేయ వ్యాధితో అలువాలోని రాజగిరి ఆసుపత్రిలో జనవరి 28న చేరారు. బుధవారం ఉదయం ఆమె మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కొచ్చిన కళాభవన్ ద్వారా మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరీర్ ప్రారంభించిన సుబి వివిధ టెలివిజన్ చానళ్లలో రియాలిటీ, కామెడీ షోలకు యాంకర్‌గా పనిచేశారు.

కనక సింహాసనం, పంచవర్ణతత, డ్రామా, 101 వెడ్డింగ్, గృహతన్, ఖిలాడి రామన్, లక్కీ లాకర్స్, ఎలసమ్మ ఎన్న ఆన్‌కుట్టి, తస్కర లహల, హ్యాపీ హస్బెండ్స్ తదితర చిత్రాలలో ముఖ్య పాత్రలలో ఆమె నటించారు. సుబి మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం ప్రకటించారు. ఒక వర్ధమాన నటిని మలయాళ చిత్ర పరిశ్రమ కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News