Wednesday, January 22, 2025

అనుమానాస్పదస్థితిలో మలయాళ నటి అపర్ణ మృతి

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : ప్రముఖ మలయాళ సినీ, టివి నటి అపర్ణ నాయర్ (31) తిరువనంతపురంలోని తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. తిరువనంతపురంలోని కరమణలోని తన నివాసంలో అపర్ణ విగత జీవిగా కనిపించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం. ఆగస్టు 31 రాత్రి 7 గంటల 30 నిముషాల సమయంలో చనిపోయినట్లు సమాచారం.సంఘటన జరిగిన సమయంలో మృతురాలి తల్లి, సోదరి ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. అపర్ణ తన బెడ్ రూంలో ఉరి వేసుకుని ఉన్నట్లు గమనించిన ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటీన కిల్లిపాలెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. దీనిపై నటి తల్లి, సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరమన పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకుని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కెరీర్, కుటుంబానికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. మృతి చెందడానికి 11 గంటల ముందు కూడా తన చిన్న కూతురుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. నటి అపర్ణ హఠన్మారణంపై అభిమానులు, తోటి నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News