Wednesday, January 22, 2025

విమానంలో సహ ప్రయాణికుడి వేధింపులపై మలయాళ నటి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

కోచ్చి: ముంబై నుంచి కేరళలోని కోచ్చికి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఒక మగప్రయాణికుడు తనను వేధింపులకు గురిచేశాడంటూ మలయాళ సినీ నటి దివ్య ప్రభ పోటీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఈ ఘటన జరిగింది.

విమానంలో తన పక్క సీట్లో మద్యం మత్తులో ఉన్న ఒక మగ ప్రయాణికుడు తనను తీవ్రంగా వేధించినట్లు ఆమె తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. తనను తీవ్రంగా ఆందోళనక గురిచేసిన ఈ ఘటన గురించి ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వివరించారు. తాను చేసిన ఫిర్యాదుపై ఎయిర్ ఇండియా గ్రౌండ్ ఆఫీసు నుంచి కాని విమాన సిబ్బంది నుంచి కాని స్పందన చాలా నిరాశాజనకంగా ఉందని ఆమె తెలిపారు. తాను పదేపదే ఎయిర్ హోస్టెస్‌కు ఫిర్యాదు చేసినా ఆమె తనను వేరే సీటులో కూర్చోపెట్టారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదని నటి పేర్కొన్నారు.

కోచ్చి విమానాశ్రయంలో దిగిన వెంటనే ఎయిర్‌పోర్టు సిబ్బందికి, ఎయిర్‌లైన్ అధికారులకు ఈ విషయం తెలియచేశానని, అయితే వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారని ఆమె తెలిపారు. ఈ విషయమై ఇమెయిల్ ద్వారా స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రతిని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. తాగిన మైకంలో ఉన్న ఆ ప్రయాణికుడు తన సీటును ఆక్రమించుకుని తనతో వాగ్వాదానికి దిగిన తీరును ఆమె వివరించారు. చేతులతో అసభ్యంతా తనను తాకుతూ అతను అమర్యాదకరంగా ప్రవర్తించాడని కూడా ఆమె ఫిర్యాదు చేశారు.

కాగా..తన ఈమెయిల్‌నే ఫిర్యాదుగా పరిగణించాలంటూ బాధితురాలు చేసిన లేఖ తమకు అందిందని నెడుంబరస్సేరి పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని, బాధితురాలిని ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని ఒక పోలీసు అధికారి చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News