Monday, December 23, 2024

మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం…

- Advertisement -
- Advertisement -

మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మాలీవుడ్‌ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన దర్శకుడు సిద్దిఖీ మంగళవారం కన్నుమూశారు. గుండెపోటుతో కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన సిద్దిఖీ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మరణించారు. ఆయన మృతిపై మాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. పలువురు ప్రముఖులు ఈ మృతి పట్ల సంతాపం తెలిపారు.

కాగా, రచయితగా కెరీర్‌ ప్రారంభించిన సిద్దిఖీ, మాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు.  మలయాళ స్టార్స్ మోహన్‌లాల్‌, మమ్ముట్టి, విజయ్‌ కాంత్‌లతో బ్లాక్‌బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. ఇక, హిందీలోనూ సల్మాన్‌ ఖాన్ తో బాడీగార్డ్‌ మూవీ తీసి సూపర్ హిట్ కొట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News