Wednesday, January 22, 2025

మలయాళ సినీ నిర్మాత పివి గంగాధరన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

కోజిక్కోడ్: ప్రముఖ మలయాళ సినీ నిర్మాత, మాగృభూమి మీడియా గ్రూపు పూర్తికాల డైరెక్టర్ పివి గంగాధరన్ శుక్రవారం ఉదయం కేరళలోని కోజిక్కోడ్‌లో కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వృద్ధాప్య ఆరోగ్య సమస్యలకు చికిత్స తీసుకుంటున్న గంగాధరన్ ఉదయం తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ వర్గాలు తెలిపాయి.

గృహలక్ష్మి ప్రొడక్షన్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడైన గంగాధరన్ అనేక చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మించిన హిట్ చిత్రాలలో వడక్కరన్ వీరగాథ, అంగాడి, ఏకలవ్యన్, అచువంటే అమ్మ, కమలక్కినవు తదితరచిత్రాలు ఉన్నాయి. నిర్మాతగానే గాక అంతర్జాతీయ సినీ నిర్మాత సంఘం ఎఫ్‌ఐఎఎఫ్‌కు ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. కేరళ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కూడా ఆయన సేవలందించారు. గంగాధరన్ సోదరుడే మాతృభూమి మేనేజింగ్ ఎడిటర్ పివి చంద్రన్. గంగాధరన్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News