Sunday, December 22, 2024

డిసెంబర్ 1 నుంచి వీసా లేకుండానే మలేషియా పర్యటించవచ్చు

- Advertisement -
- Advertisement -

కౌలాలంపూర్ : భారత్, చైనా పౌరులు ఎలాంటి వీసా అవసరం లేకుండానే డిసెంబర్ 1 నుంచి 30 రోజుల పాటు తమ దేశంలో పర్యటించవచ్చని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహిం వెల్లడించారు. ఆదివారం రాత్రి పీపుల్స్ జస్టిస్ పార్టీ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. అయితే డిసెంబర్ తరువాత ఎంతకాలం వీసా మినహాయింపు వర్తిస్తుందో ఆయన వివరించలేదు. మలేషియాకు చైనా, భారత్ దేశాలు వాణిజ్య పరంగా అత్యధిక వనరులుగా పరిగణించడమౌతోంది.

ప్రభుత్వ డేటా ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు మలేషియాలో 9.16 మిలియన్ పర్యాటకులు పర్యటించారు.వీరిలో 4,98,540 మంది చైనా నుంచి, 2,83,885 మంది భారత్ నుంచి మలేషియాకు వెళ్లారు. 2019లో ఇదే కాలంలో చైనా నుంచి 1.5 మిలియన్ మంది , భారత్ నుంచి 3,54,486 మంది మలేషియాకు వెళ్లారు. థాయ్‌లాండ్, శ్రీలంక ప్రభుత్వాలు కూడా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి వీసా లేకుండానే భారతీయులు తమ దేశాల్లో పర్యటించే అవకాశాన్ని కల్పించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News