Wednesday, January 22, 2025

డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో మలేషియా భారతీయుడికి ఉరిశిక్ష

- Advertisement -
- Advertisement -

Malaysian man of Indian-origin sentenced to death

సింగపూర్: మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో మధ్యవర్తిగా వ్యవహరించిన భారతీయ మూలాలు ఉన్న మలేషియావాసికి సింగపూర్ కోర్టు మరణశిక్షను విధించింది. 2016లో కిశోర్ కుమార్ రాఘవన్(41) సింగపూర్‌లో 900 గ్రాముల మాదకద్రవ్యం పౌడరును చేరవేయడానికి మోటార్‌ సైకిల్‌పై వెళుతున్నప్పుడు పట్టుబడ్డాడు. తర్వాత అతడి బ్యాగులో 36.5 గ్రాముల చొప్పున నాలుగు మాదకద్రవ్యాల బండల్స్ ఉన్నాయని తెలిసింది. సింగపూర్‌లో అక్కడి చట్టం ప్రకారం 15 గ్రాముల కన్నా ఎక్కువ మాదకద్రవ్యాన్ని తరలిస్తే మరణశిక్ష విధిస్తారు. కిశోర్ కుమార్ రాఘవన్ నుంచి సింగపూర్ వాసి, చైనీయుడు పుంగ్ అహ్ కియాంగ్(61) మాదక ద్రవ్యాల బ్యాగును అందుకున్నాడు. అక్రమ రవాణా కోసం మాదకద్రవ్యాలను కలిగి ఉన్నందుకు అతడికి జీవిత ఖైదును విధించారు. ఆ బ్యాగులో హిరాయిన్ మాదకద్రవ్యం ఉన్నట్లు రాఘవన్, పుంగ్‌కు తెలుసునని అక్కడి హైకోర్టు న్యాయమూర్తి ఆడ్రే లిమ్ భావించారు. ‘బ్యాగులో రాళ్లు ఉండినాయి’అన్న రాఘవన్ డిఫెన్స్ లాయర్ వాదనని ఆమె తిరస్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News