Monday, December 23, 2024

మాల్దీవుల అధ్యక్షుడిపై క్షుద్ర విద్యలు.. మహిళా మంత్రి అరెస్టు

- Advertisement -
- Advertisement -

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జుపై క్షుద్ర విద్యలు ప్రయోగించిన మహిళా మంత్రిని మాలె పోలీసులు అరెస్టు చేశారు. పర్యావరణ, వాతావరణ మార్పు, ఇంధన శాఖల మంత్రి శాతీమాత్ షామ్నాజ్ అలీ సలీమ్‌తోపాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు గురువారం తెలిపారు. ఆమెను వారం రోజుల కస్టడీకి అప్పగించినట్లు వారు చెప్పారు.

అయితే ఆమెను అరెస్టు చేయడానికి గల కారణాలను వారు వెల్లడించలేదు. కాగా..అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జుపై మంత్రి షామ్నాజ్ క్షుద్ర విద్యలు ప్రదర్శించినట్లు స్థానిక పత్రిక సన్ తెలిపింది. ఈ వార్తపై పోలీసుల నుంచి ఎటువంటి స్పందన వ్యక్తం కాలేదు. ముస్లింల అధిక సంఖ్యలో ఉన్న మాల్దీవులలో క్షుద్రవిద్యాలు నేరం కాదు. అయితే ఇస్లామిక్ చట్టం ప్రకారం ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News