Sunday, December 22, 2024

మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం

- Advertisement -
- Advertisement -

మాలె : మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రధాన ప్రతిపక్షంఎండిపి యోచిస్తోందని సోమవారం మీడియా వార్తలు వెల్లడించాయి. మాల్దీవుల పార్లమెంట్‌లో ఎండిపికి ఆధిక్యం ఉంది. చైనా అనుకూల అధ్యక్షుని మంత్రివర్గంలో నలుగురు సభ్యులకు ఆమోదముద్రపై విభేదాల నేపథ్యంలో ప్రభుత్వ అనుకూల ఎంపిలు, ప్రతిపక్షఎంపిల మధ్య ఆదివారం పార్లమెంట్‌లో ఘర్షణలు చోటు చేసుకోగా సోమవారం ఈ పరిణామం చోటు చేసుకున్నది. అధ్యక్షుడు ముయిజ్జు మంత్రివర్గ సభ్యులు నలుగురికి వోటింగ్‌కు ముందు పార్లమెంటరీ ఆమోదాన్ని నిలిపివేయాలని మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ (ఎండిపి),

డెమోక్రాట్స్ పార్లమెంటరీ గ్రూప్ నిర్ణయించిన తరువాత అధికార పార్టీ మాల్దీవుల ప్రగతిశీల పార్టీ, పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పిపిఎం/ పిఎన్‌సి) కూటమి నిరసనకు దిగగాపార్లమెంటరీ సమావేశానికి అంతరాయం కలిగింది. ‘డెమోక్రాట్స్ భాగస్వామ్యంతో ఎండిపి అభిశంసన తీర్మానం కోసం తగినన్ని సంతకాలు సేకరించింది. అయితే, వారు దానిని ఇంకా సమర్పించవలసి ఉంది’ అని ఎండిపి ఎంపిని ఉటంకిస్తూ సన్.కామ్ తెలియజేసింది. అభిశంసన తీర్మానాన్ని సమర్పించాలని సోమవారం ఎండిపి పార్లమెంటరీ గ్రూప్ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ది ఎడిషన్.ఎంవి తెలియజేసింది. నిరుడు సెప్టెంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో భారత్ అనుకూల అధ్యక్షుడు ఇబ్రహీమ్ మొహమద్ సోలిహ్‌ను 45 ఏళ్ల ముయిజ్జు ఓడించిన విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News