Thursday, January 23, 2025

మాపై వేధింపులకు మీకు లైసెన్స్ ఇవ్వలేదు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చైనాలో తన ఐదు రోజుల పర్యటనను ముగించుకున్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తమ దీవిని ‘వేధించేందుకు’ ఏ దేశానికీ హక్కు లేదు అని శనివారం సుస్పష్టం చేశారు. భారత్, మాల్దీవుల మధ్యదౌత్య వివాదం నేపథ్యంలో ముయిజ్జు ప్రకటన చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల లక్షదీవుల పర్యటనను కించపరిచే విధంగా మాల్దీవుల రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య దౌత్య వివాదానికి దారి తీసిన విషయం విదితమే. ముయిజ్జు విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, ‘మాది చిన్న దేశం కావచ్చు. అయితే, మమ్మల్ని వేధించేందుకు అది మీకు లైసెన్స్ ఇవ్వలేదు’ అని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ లక్షదీవుల పర్యటన గురించి మాల్దీవుల మంత్రులతో సహా రాజకీయ నాయకులు కించపరిచే వ్యాఖ్యలు చేసిన తరువాత భారత్, మాల్దీవుల మధ్యవివాదం నెలకొన్న విషయం విదితమే. తమ ద్వీప దేశం నుంచి పర్యాటకులను లాగివేసే ప్రయత్నంగా మోడీ లక్షదీవుల పర్యటనను మాల్దీవుల మ ంత్రులు ఆక్షేపించారు. మాల్దీవులతో ఈ వ్యవహారాన్ని భారత్ ప్రస్తావించిన తరువాత ముగ్గురు మంత్రులను ఈ నెల 7న వారి పదవుల నుంచి సస్పెండ్ చేశారు. ఆ మరునాడు భారత్‌లోని మాల్దీవుల రాయబారిని విదేశాంగ మంత్రిత్వశాఖ పిలిపించి ప్రధాని మోడీపై సోషల్ మీడియాలో కించపరిచే వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మాల్దీవుల మ ంత్రుల వ్యాఖ్యలు భారతీయులకు అమిత ఆగ్రహం కలిగించాయి. దానితో వారు ఆ ద్వీప దేశంలో తాము జరపదలచిన పర్యటనలను రద్దు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News