- Advertisement -
మాలే: మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో అధికార మాల్దీవుల డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు ఇబ్రహీం ముహమ్మద్ సోలిహ్ గెలుపొందినట్లు ఆదివారం ప్రాథమిక ఫలితాల సమాచారం. అధికారంలో ఉన్న వ్యక్తి ఎన్నికల్లో పోటీని ఎదుర్కోవడం ఇదే తొలిసారి. అయితే ఆయనపై పోటీచేసిన మాజీ అధ్యక్షుడు ముహమ్మద్ నషీద్ ఫలితాలను అంగీకరించలేదు. ఆయనకు ప్రచారం చేసిన ఓ అధికారి ఫలితాలు అనుమానస్పందంగా ఉన్నాయన్న సందేహాన్ని వెల్లిబుచ్చారు. ఎందుకంటే కొన్ని బ్యాలెట్ స్టేషన్లలో ఓటర్ల సంఖ్యతో అర్హత కలిగిన ఓటర్ల సంఖ్య సరిపోలేదు. నషీద్ మద్దతుదారులు ఓటు రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. సోలిహ్ 24556 ఓట్లతో 61 శాతం ఓట్లను సాధించడమేకాక, నషీద్‌ను 15641 ఓట్లతో ఓడించారు. అయితే పోటీపడ్డ ఆ ఇద్దరూ గత నెలలో దేశవ్యాప్తంగా సుడిగాలి ప్రచార పర్యటనలు చేశారు.
- Advertisement -